న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఢిల్లీ మద్యం పాలసీపై సీబీఐ నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. మరోవైపు తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం సీబీఐని ఆదేశించింది.
న్యూఢిల్లీ: అయోధ్య ఆలయంలోని బాలక్ రామ్ విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు వీసాను అమెరికా నిరాకరించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 1 వరకు వర్జీనియాలో జరిగే ప్రపంచ కన్నడ మహా సభలకు ఆయన హాజరుకావలసి ఉంది. ఇటీవల ఆయనకు ప్రపంచ గుర్తింపు లభించిన నేపథ్యంలో వీసా నిరాకరణకు గురికావడం పట్ల కుటుంబ సభ్యులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.