బెంగళూరు: ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం తోక భాగం నేలను తాకింది. అందులోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో సమగ్ర తనిఖీ కోసం ఆ విమానాన్ని నిలిపివేశారు. (Air India Flight) గురువారం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 2651 విమానం ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్నది. ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో విమానం తోక భాగం నేలను తాకింది.
కాగా, ఆ విమానంలోని 179 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, వారంతా సాధారణంగానే దిగినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. సమగ్ర తనిఖీ కోసం ఆ విమానాన్ని నిలిపివేసినట్లు పేర్కొంది. నియంత్రణ అధికారులతో సమన్వయం చేసుకుని, నిర్దేశిత విధానాలకు అనుగుణంగా ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని వెల్లడించింది.
మరోవైపు ఆ విమానాన్ని గ్రౌండ్ చేసిన నేపథ్యంలో బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 2652 తిరుగు ప్రయాణ ఫ్లైట్ సర్వీసును రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రభావిత ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ‘కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా చింతిస్తోంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా అత్యున్నత ప్రాధాన్యత’ అని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.
Also Read:
Mayawati | మాయావతి నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు.. తిప్పి పంపిన సెక్యూరిటీ సిబ్బంది
Watch: తాత, నానమ్మ నుంచి బాలిక కిడ్నాప్.. తర్వాత ఏం జరిగిందంటే?