man swept away by crocodile | అత్త అంత్యక్రియల తర్వాత స్నానానికి నదిలోకి దిగిన వ్యక్తి.. లాక్కుపోయిన మొసలి
man swept away by crocodile | అత్త మరణించడంతో అంత్యక్రియల తర్వాత స్నానం కోసం ఒక వ్యక్తి నదిలోకి దిగాడు. అయితే ఒక మొసలి అతడ్ని నోటకరుచుకుని నీటి లోపలకు లాక్కుపోయింది. పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.
లక్నో: అత్త మరణించడంతో అంత్యక్రియల తర్వాత స్నానం కోసం ఒక వ్యక్తి నదిలోకి దిగాడు. అయితే ఒక మొసలి అతడ్ని నోటకరుచుకుని నీటి లోపలకు లాక్కుపోయింది. పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. (man swept away by crocodile) ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నోయిడాలో నివసించే దీపక్ శర్మ అత్త ఊర్మిళా దేవి చనిపోయింది. ఈ నేపథ్యంలో అతడు తన భార్యతో కలిసి ఉమ్రి గ్రామానికి చేరుకున్నాడు.
కాగా, బుధవారం సరయూ నది ఒడ్డున ఊర్మిళా దేవి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఏర్పాట్లలో సహాయం చేసిన దీపక్ శర్మ, ఆ తర్వాత స్నానం కోసం సరయూ నదిలోకి దిగాడు. ఆ నదిలో మొసళ్లు ఉంటాయని కొందరు హెచ్చరించినప్పటికి అతడు పట్టించుకోలేదు. ఇంతలో ఒక మొసలి దీపక్ను నోటకరుచుకుని నీటిలోకి లాక్కుపోయింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. దీపక్ కోసం స్థానికులతో కలిసి పడవలో ఆ నదిలో గాలించారు. ఫలితం లేకపోవడంతో లక్నో నుంచి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాన్ని పిలిపించారు. దీపక్ మృతదేహం లభించకపోవడంతో అతడి కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉన్నది.
#Tragic Crocodile Attack in Gonda, #UttarPradesh
In a heartbreaking incident, 30-year-old Deepak from Greater Noida was dragged into the Saryu River by crocodiles while bathing after his mother-in-law’s cremation in Umri Begamganj area on May 20, 2026. Locals witnessed the… pic.twitter.com/yMUQJojfc2
— Thepagetoday (@thepagetody) May 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

