Air Pollution | దేశరాజధాని ఢిల్లీలో వరుసగా ఆరు రోజుల తర్వాత మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) కాస్త మెరుగుపడింది. అయినప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) ప్రకారం.. మంగళవారం ఉదయం 9 గంటలకు దేశరాజధాని ఢిల్లీలో ఏక్యూఐ 272గా నమోదైంది.
అత్యధికంగా ముండకా ప్రాంతంలో ఏక్యూఐ 327 తో అధ్వాన స్థితికి చేరినట్లు తెలిపింది. ఇక ఆనంద్ విహార్‌లో 318, అయా నగర్లో 313, వజీర్‌పూర్‌లో 307, పట్పర్ గంజ్‌లో 296, ఆర్కేపురంలో 295, రోహిణి ప్రాంతంలో 287, ఓఖ్లాఫేజ్ – 2 లో 265, ఐటీవో ప్రాంతంలో 261, లోధీ రోడ్డులో 255, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో 247, అరబిందో మార్గ్‌లో 240గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
#WATCH | Delhi | AQI around ITO and surrounding areas recorded 261, categorised as ‘Poor’ according to the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/FvG2oZGgJB
— ANI (@ANI) October 29, 2024
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
#WATCH | Delhi | AQI around Lodhi Road and surrounding areas recorded 255, categorised as ‘Poor’ according to the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/rYZboXTtYN
— ANI (@ANI) October 29, 2024
కాగా, ఈ మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల నుంచిదేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రమవుతోంది. దీపావళి పండుగకు ముందే వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతుండడంతో ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. దీనికి తోడు పొగమంచు కూడా రాజధాని ప్రాంతాన్ని ఆవహించింది. దీంతో నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) అధ్వానస్థితికి చేరినట్లు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది.
Also Read..
Washington Post | అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్‌కు ఊహించని షాక్..!
Kerala CM | కేరళ సీఎంకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ.. VIDEO
Jammu and Kashmir: ఆక్నూర్ ఆపరేషన్‌లో ఇద్దరు మిలిటెంట్లు కాల్చివేత..