Washington Post | మరో వారంలో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగారు. ఇరువురూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలుపే లక్ష్యంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఈ ఎన్నికల వేళ.. యూఎస్‌కు చెందిన ప్రముఖ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ (Washington Post)కు ఊహించని షాక్ తగిలింది.
అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని వాషింగ్టన్ పోస్ట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో వాషింగ్టన్ పోస్ట్ దాదాపు 2 లక్షల మంది సబ్స్క్రైబర్లను (2 lakh subscribers) కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు వాషింగ్టన్ పోస్ట్ నిర్ణయాన్ని పత్రిక యజమాని, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) సమర్థించారు. అధ్యక్ష ఎన్నికల్లో క్రిడ్ ప్రోకోకు (quid pro quo) తావు లేదన్నారు. విశ్వసనీయత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
సోమవారం మధ్యాహ్నం నాటికి 2 లక్షల మందికిపైగా వాషింగ్టన్ పోస్ట్ డిజిటల్ సబ్స్క్రిప్షన్లన రద్దు చేసినట్లు ఎన్పీఆర్ మీడియా అవుట్‌లెట్‌ను ఊటంకిస్తూ ఓ నివేదిక తెలిపింది. అన్ని రద్దులు వెంటనే అమలులోకి రావని ఎన్పీఆర్ నివేదిక పేర్కొంది. ఇక ఈ సంఖ్య పేపర్ చెల్లింపు సర్క్యులేషన్లో ఉన్న 2.5 మిలియన్ల సబ్స్క్రైబర్లలో 8 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇందులో ప్రింట్ మీడియా కూడా ఉన్నట్లు పేర్కొంది. అలాగే పలువురు కాలమిస్టులు వాషింగ్టన్ పోస్ట్‌కు రాజీనామా చేసినట్లు ఎన్పీఆర్ నివేదించింది. అయితే, ఈ నివేదికపై స్పందన కోసం రాయిటర్స్ చేసిన అభ్యర్థనకు వాషింగ్టన్ పోస్ట్ నిరాకరించింది.
Also Read..
Joe Biden | శ్వేత సౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు.. అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ ప్రత్యేక సందేశం
Kerala CM | కేరళ సీఎంకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ.. VIDEO
Jammu and Kashmir: ఆక్నూర్ ఆపరేషన్‌లో ఇద్దరు మిలిటెంట్లు కాల్చివేత..