Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆధ్వర్యంలో శ్వేత సౌధం (White House)లో దీపావళి వేడుకలు (Diwali party) ఘనంగా జరిగాయి. బ్లూరూమ్‌లో జరిగిన ఈ వేడుకల్లో బైడెన్ కార్యవర్గంలోని ఇండో-అమెరికన్లు, అధికారులు, కార్పొరేట్ దిగ్గజాలు.. దాదాపు 600 మందికిపైగా అతిథులు హాజరయ్యారు. వేడుకల సందర్భంగా ఆ ప్రాంతాన్ని పూలతో సుందరంగా అలంకరించారు.
ఈ కార్యక్రమానికి ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గైర్హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాల కారణంగా వీరిద్దరూ వేడులకు హాజరుకాలేదని సదరు వర్గాలు తెలిపాయి. ఈ వేడుకల నేపథ్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి సునీతా విలియమ్స్ ప్రత్యేక సందేశాన్ని పంపారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read..
Kerala CM | కేరళ సీఎంకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ.. VIDEO
Kerala Festival: కేరళ ఉత్సవంలో పేలిన బాణాసంచా.. 150 మందికి గాయాలు
Walking Daily 30 Minutes | రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే చాలు.. ఆయుష్షు పెరుగుతుందట..!