న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆదివారం ప్రధాని మోదీతో సమావేశమై భద్రతా పరిస్థితిని చర్చించినట్లు తెలిసింది. మరుసటి రోజే రక్షణ కార్యదర్శి ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.