త్రిభాషా విధానాన్ని అమలుచేస్తామని దమ్ముంటే ప్రకటించండి.. మోదీ-షాకు తమిళనాడు సీఎం స్టాలిన్ సవాల్
తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలుచేస్తామని దమ్ముంటే ప్రకటించండి అని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు.
చెన్నై: తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలుచేస్తామని దమ్ముంటే ప్రకటించండి అని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. శనివారం శంకరన్ కోవిల్లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ తమిళనాడులో హిందీని అమలు చేయాలని ప్రయత్నిస్తూ బీజేపీ తన గొయ్యిని తానే తవ్వుకొంటున్నదని ఆయన తెలిపారు. ‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులో అమలు చేసే దమ్ముందా?’ అని ఆయన ప్రశ్నించారు.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతి విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాలనే ప్రతిపాదనను సీబీఈఎస్‌ఈ ప్రవేశపెట్టింది. ఇందులో రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలి. ఇంగ్లిష్‌ను విదేశీ భాషగా ఈ ప్రతిపాదనలో పొందుపరిచారు. తనపై ఎదురు దాడి చేసిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను స్టాలిన్ తిప్పికొట్టారు. తమ రాష్ర్టానికి కేంద్రం విద్యా నిధులను నిలిపేసిందని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

