Haridwar | ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని హరిద్వార్ (Haridwar) మానసాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Mansa Devi Temple stampede)లో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. సుమారు 30 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో వందల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో మెట్ల మార్గంలో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ విద్యుత్తు షాక్‌కు కొందరు గాయపడినట్టు భక్తులు తెలిపారు.
ఆలయానికి సమీపంలోని ఒక విద్యుత్తు స్తంభం నుంచి కరెంట్ ప్రసారం అయ్యిందని, దానికి తగిలి కొందరు విద్యుదాఘాతానికి గురయ్యారని, దీంతో భయాందోళనతో భక్తులు పెద్దపెట్టున అరవడంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాటకు దారి తీసిందని చెప్పారు. ఘటనపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయం ప్రకటించింది.
Also Read..
Parliament Session | సిందూర్‌పై చర్చ.. మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో మాట్లాడనున్న రాజ్‌నాథ్ సింగ్
Electric Shock | తెగిపడిన విద్యుత్ వైర్లు.. మహాదేవ్ ఆలయంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు భక్తులు మృతి
మహిళల ఆర్థికాభివృద్ధి పథకంలో పురుష లబ్ధిదారులు.. మహారాష్ట్రలో లడ్కీ బెహన్ స్కామ్