e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home Top Slides హర్యానాకు దత్తన్న మిజోరానికి కంభంపాటి

హర్యానాకు దత్తన్న మిజోరానికి కంభంపాటి

  • కర్ణాటక గవర్నర్‌గా కేంద్రమంత్రి థావర్‌చంద్‌
  • పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు

న్యూఢిల్లీ, జూలై 6: క్యాబినెట్‌ విస్తరణకు ముందు కేంద్ర ప్రభుత్వం పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరికొందరిని బదిలీ చేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకుడు కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా నియమించారు. కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బుధవారం థావర్‌చంద్‌ మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేపీ సీనియర్‌ నేతలు మంగూభాయ్‌ చగన్‌భాయ్‌ పటేల్‌ (మధ్యప్రదేశ్‌), రాజేంద్రన్‌ విశ్వనాథ్‌ అర్లేకర్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌)కు గవర్నర్‌ పదవులు వరించాయి. హర్యానా గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్యను త్రిపురకు, త్రిపుర గవర్నర్‌ రమేశ్‌ బైస్‌ను జార్ఖండ్‌కు, మిజోరం గవర్నర్‌ పీఎస్‌ శ్రీధరన్‌ పిైళ్లెను గోవాకు బదిలీ చేశారు.

మిజోరం అభివృద్ధికి కృషి చేస్తా: హరిబాబు
హైదరాబాద్‌, జూలై 6 (నమస్తే తెలంగాణ): విశాఖ ఎంపీగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో మిజోరం అభివృద్ధికి కృషి చేస్తానని ఆ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన కంభంపాటి హరిబాబు తెలిపారు. తనను గవర్నర్‌గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

రాష్ట్రం కొత్త గవర్నర్‌
హర్యానా బండారు దత్తాత్రేయ
మిజోరం కంభంపాటి హరిబాబు
కర్ణాటక థావర్‌చంద్‌ గెహ్లాట్‌
ఎంపీ మంగూభాయ్‌
గోవా పీఎస్‌ శ్రీధరన్‌ పిైళ్లె
త్రిపుర సత్యదేవ్‌ నారాయణ్‌
జార్ఖండ్‌ రమేశ్‌ బైస్‌
హిమాచల్‌ రాజేంద్ర న్‌ విశ్వనాథ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana