Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికలు తుది అంకానికి చేరడంతో ప్రచార పర్వం క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సహా అగ్రనేతలు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు.
ఇక మాటల తూటాలు పేలుతుండటంతో పాటు ప్రచార అంకానికి తెరపడుతుండటంతో చివరి ప్రయత్నంగా భావోద్వేగంతో ముడిపడిన అంశాలను పదేపదే లేవనెత్తుతున్నారు. ఇక ఓటమి భయంతో ప్రధాని నరేంద్ర మోదీ రోజుకో వర్గాన్ని నిందిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ నిత్యం జనాలను రెచ్చగొడుతున్నా దేశ ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని అమ్రోహ కాంగ్రెస్ అభ్యర్ధి డానిష్ అలీ పేర్కొన్నారు.
ఓటమి తప్పదని మోదీ గ్రహించారని, జూన్ 4న ఆయన పదవిని కోల్పోతున్నారని జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే సహనం కోల్పోయిన ప్రధాని మోదీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఆయన తీరుతెన్నులు ఈ విషయం వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.
Read More :
Rajasthan | ఎడారి రాష్ట్రంలో భానుడి భగభగలు.. 3,622కి చేరిన వడదెబ్బ బాధితులు