Rajasthan | ఎడారి రాష్ట్రంలో భానుడి భగభగలు.. 3,622కి చేరిన వడదెబ్బ బాధితులు
Rajasthan | ఎడారి రాష్ట్రం రాజస్థాన్ (Rajasthan)లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా నమోదవుతున్నాయి (Heatwave).
Rajasthan | ఎడారి రాష్ట్రం రాజస్థాన్ (Rajasthan)లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా నమోదవుతున్నాయి (Heatwave). భానుడి భగభగలకు జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వృద్ధులు, పిల్లలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఈ వడదెబ్బకు (Heatstroke) ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురైన వారి సంఖ్య రాష్ట్రంలో భారీగా పెరిగింది. సోమవారం వరకూ సుమారు 3,622 మంది వడదెబ్బకు గురైనట్లు (Heatstroke Patient) అధికారులు తెలిపారు. ఇక వడదెబ్బ కారణంగా శుక్రవారం వరకూ రాష్ట్రంలో 12 మరణాలు సంభవించిన విషయం తెలిసిందే.
ఫలోడిలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ సాధారణం కంటే 6.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం నాడు ఫలోడిలో అత్యధికంగా 49.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జైపూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 46.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఇది ఆదివారంతో పోలిస్తే 0.8 డిగ్రీలు ఎక్కువ. ఇక రాజస్థాన్ కోటలో గరిష్ట ఉష్ణోగ్రతలు 48.2 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువ.
రాష్ట్రంలోని అన్ని నగరాల్లో 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అజ్మీర్‌లో 46.3 డిగ్రీల సెల్సియస్, భిల్వారా (47.4), భరత్పూర్ (48.2), అల్వార్ (46.2), పిలానీ (48.5), చిత్తోర్‌గఢ్ (47), బార్మర్ (49.3), జైసల్మేర్ (48.7), జోధ్‌పూర్ (47.4) గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బికనీర్ (48.2), చురు (48), శ్రీ గంగానగర్ (48.3), ధోల్పూర్లో గరిష్టంగా 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
రాబోయే 2-3 రోజుల పాటు రాష్ట్రంలో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని జైపూర్ వాతావరణ శాఖ డైరెక్టర్ రాధేశ్యామ్ శర్మ వెల్లడించారు. మే 29 నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపారు. జూన్ మొదటి వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Also Read..
Dubbaka | అయోధ్య రామయ్య అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం
Medak | ఆరు నెలలుగా జీతాలు లేవు.. ఎట్లా బతికేది?.. పంచాయతీ కార్మికుల ఆవేదన
Telangana | యువతకు దారిచూపిన దశాబ్ది
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

