ముంబై: మనీ లాండరింగ్ కేసు పెట్టామంటూ జస్టిస్ చంద్రచూడ్ పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు ఓ ముంబై మహిళ(68)కు రూ.3.71 కోట్లకు టోకరా వేశారు. ఆమెను డిజిటల్ అరెస్ట్ పేరుతో వేధించి ఈ మోసానికి పాల్పడ్డారు.
నిందితుల్లో ఒకరిని గత వారం గుజరాత్లో అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 18-అక్టోబర్ 13 మధ్య ఈ మోసం జరిగింది. తొలుత తాము కొలబ స్టేషన్ పోలీసులుగా పేర్కొన్న నిందితులు నకిలీ ఆన్లైన్ కోర్టు విచారణ నిర్వహించి మనీ లాండరింగ్ కేసు పేరుతో బాధితురాలిని భయపెట్టారు.