న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ర్టాలు, దేశ రాజధాని భారీ వరదల్లో చిక్కుకున్న నేపథ్యంలో విచక్షణారహితంగా జరుగుతున్న చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
చట్టాల ఉల్లంఘన బహిరంగంగా జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, నాలుగు రాష్ర్టాలకు నోటీసులు జారీచేసింది. ఉత్తర భారతంలోని అనేక రాష్ర్టాలలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో, కొండచరియలు విరిగిపడడం, ఇష్టారీతిన చెట్ల నరికివేత జరిగినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.