Cuddalore train accident | తమిళనాడులోని కడలూరు (Cuddalore)లో ఘోర ప్రమాదం (Train Accident) జరిగిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాను (School Van) కడలూరు జిల్లా సెమ్మంగుప్పం వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM Stalin) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. అదేవిధంగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను సీఎం ఆదేశించారు.
మరోవైపు దక్షిణ మధ్య రైల్వే (Southern Railway) సైతం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఘటనకు కారణమైన గేట్‌కీపర్ పంకజ్ శర్మను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది.
Also Read..
Train Accident | స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు చిన్నారు మృతి, 12 మందికి తీవ్రగాయాలు
Smriti Irani | టీవీ షోలోకి స్మృతి ఇరానీ రీఎంట్రీ.. అప్పట్లో రూ.1,800 పారితోషికం.. ఇప్పుడెంతంటే..?
Himachal Pradesh | అర్ధరాత్రి విలయం.. 67 మంది ప్రాణాలు కాపాడిన శునకం