న్యూఢిల్లీ, మే 9 : భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సీఆర్పీఎఫ్లో బదిలీలు, పోస్టింగ్ ఆర్డర్స్, సిబ్బంది శిక్షణా కోర్సులను వాయిదా వేస్తున్నట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల భద్రతను బలోపేతానికి జమ్ముకశ్మీర్‌కు 2,400 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలను పంపినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
అత్యవసర భద్రతా పరిస్థితుల కారణంగా అధికారులు, ఇతర సిబ్బంది వారి వారి పోస్టింగ్ స్థానంలోనే ఉండాలని సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.