ముంబై : భారీ వర్షాల కారణంగా తన 11 ఎకరాల వరి పంట పూర్తిగా నష్టపోయిన ఒక రైతుకు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం కేవలం రూ. 2.30 పరిహారంగా చెల్లించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాల్ఘర్ జిల్లా, వాడ తాలూకాలోని షిల్లాట్టర్ గ్రామానికి చెందిన రైతు మధుకర్బాబురావు పాటిల్ ఈ దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు.
ప్రభుత్వం తన నష్టాన్ని కేవలం రూ. 2.30గా అంచనా వేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ఇటీవలి వర్షాలకు ఆ రాష్ట్రంలో 68 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతిన్నది.