పాట్నా: బీహార్లో కొలువైన కొత్త శాసనసభలోని 243 మంది ఎమ్మెల్యేల్లో 130 (53 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 102 (42 శాతం) మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాభియోగాలున్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడినట్టు ఆరుగురిపై కేసులు ఉన్నాయి.
బీజేపీలో ప్రతి ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. 54 మంది బీజేపీ, 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థ తెలిపింది.