CPI : కేంద్ర బడ్జెట్ గురించి ప్రభుత్వం ఏం చెప్పినా మోదీ సర్కార్‌ను కాపాడుకునేందుకే ఈ బడ్జెట్ ముందుకొచ్చిందనేది వాస్తవమని సీపీఐ నేత అన్నీ రాజా అన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునే క్రమంలోనే ఏపీకి, బిహార్‌కు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు మెరుగ్గా దక్కాయని ఆమె పేర్కొన్నారు. వరదలు, వెనుకబాటుతనంతో సతమమయ్యే ఇతర రాష్ట్రాలకు అదే ప్రాతిపదికన కేటాయింపులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
సామాజిక రంగానికి కేటాయింపులు లేవని దుయ్యబట్టారు. మహిళా, శిశు సంక్షేమానికి జండర్ బడ్జెట్‌తో కలిపి రూ. 3 లక్షల కేటాయింపులు చేపట్టారని, ఈ కేటాయింపుల్లో ఎలాంటి పెంపూ లేదని అరకొరగా ఉన్నాయని అన్నీ రాజా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ (Union Budget 2024) పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA parties) నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బుధవారం ఉదయం సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ (Parliament) వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపించారు.
Read More :
YS Jagan | ఏపీలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యం: వైఎస్ జగన్