శుక్రవారం 05 జూన్ 2020
National - May 19, 2020 , 21:02:56

రికార్డు స్థాయిలో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు..

రికార్డు స్థాయిలో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు..

ముంబై: మహారాష్ట్రలో  ఇవాళ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారని మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చేరిన వారిలో అత్యధికంగా 1202 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర లో కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు 25 శాతంగా ఉన్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో కొత్తగా 2100 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు చెప్పారు. మొత్తం కేసుల సంఖ్య 37,158కి చేరుకున్నాయని తెలిపారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo