అనిల్ అంబానీ ఆస్తిని. యెస్ బ్యాంక్ ఏం చేసిందంటే!
అనిల్ అంబానీ ఆస్తి అప్పుల చెల్లింపు కోసం అనిల్ అంబానీ.. తన రిలయన్స్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని ప్రైవేట్ బ్యాంక్ యస్ బ్యాంకుకు రూ.1200 కోట్లకు ..

ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ తన అప్పులు చెల్లించడానికి ఆస్తులను తెగనమ్మేస్తున్నారు. తాజాగా, ముంబైలోని ‘రిలయన్స్ సెంటర్’ ప్రధాన కార్యాలయాన్ని రూ. 1,200 కోట్లకు విక్రయించారు. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఈ వేలం చేపట్టింది.
అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని బయటపడేసేందుకు వేల కోట్ల విలువ చేసే తన ఆస్తిని అనిల్ అంబానీ అమ్మేశారు. ఈ ఏడాది జనవరిలో కూడా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు ఆస్తులను విక్రయించింది. దీన్ని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యెస్ బ్యాంక్ టేకోవర్ చేసింది.
రిలయన్స్ ప్రధాన కార్యాలయాన్ని తన కార్పొరేట్ ప్రధాన కార్యాలయంగా వినియోగించనున్నట్టు యెస్ బ్యాంకు పేర్కొంది. బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పును తీర్చడానికే ఈ ఆస్తిని అమ్మినట్టు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంతకుముందు ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్‌ను రూ.3,600 కోట్లకు, పర్బతి కోల్డామ్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్‌ను రూ.900 కోట్లకు అనిల్ అంబానీ విక్రయించిన సంగతి తెలిసిందే.
రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా యెస్ బ్యాంకుకు రూ. 2000 కోట్ల వరకు బకాయి ఉంది. కాగా… అప్పులను తీర్చిన ప్రకటన వచ్చిన తర్వాత కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా దూసుకెళ్లింది. పది శాతం వరకు ర్యాలీ చేసిన తర్వాత మిడ్-సెషన్ సమయంలో 7.98 శాతంతో ఇంట్రాడే గరిష్ఠ స్థాయి వద్ద ట్రేడయింది.
ఇవి కూడా చదవండి..
బంగారం ధర రూ.40 వేల దిగువకు.. ఎందుకంటే?!
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
దీదీ.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా?
ఒప్పో F19 రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లం టీతో ఆస్తమాకు గుడ్‌బై.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం
ఏప్రిల్‌లో భారత్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే!
ఫ్యూచర్‌కు లైఫ్‌లైన్.. డీల్ అమలుకు రిలయన్స్ 6 నెలల టైం!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- anil ambani
- yes bank
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

