ఫ్యూచర్‌కు లైఫ్‌లైన్.. డీల్ అమలుకు రిలయన్స్ 6 నెలల టైం!
ఫ్యూచర్‌కు లైఫ్‌లైన్| అతమ సంస్థలో విలీన ఒప్పందం అమలుపై ఫ్యూచర్‌కు రిలయన్స్ 6 నెలల గడువు ఇచ్చింది.

న్యూఢిల్లీ: అమెజాన్‌తో న్యాయ పోరాటం నేపథ్యంలో కిశోర్ బియానీ సారధ్యంలోని ఫ్యూచర్ రిటైల్ గ్రూప్‌కు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లైఫ్‌లైన్ ఇచ్చింది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం అమలు సమయాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ శుక్రవారం ప్రకటించింది. ఇంతకుముందు రిలయన్స్ రిటైల్‌లో విలీనం కోసం చేసుకున్న ఒప్పందం అమలు చేయడానికి ఫ్యూచర్ రిటైల్ గ్రూప్‌కు గత నెలాఖరు వరకు పొడిగించింది.
తాజాగా అమెజాన్‌తో న్యాయ వివాదం నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు ఫ్యూచర్ రిటైల్‌కు మరో ఆరు నెలలు పొడిగించింది. దీంతో సెప్టెంబర్ నెలాఖరు వరకు ఫ్యూచర్ రిటైల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకునేందుకు వెసులుబాటు లభించినట్లయింది.

ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేయడానికి రిలయన్స్ రిటైల్ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు ఉంటుంది.
ఫ్యూచర్ గ్రూప్ అనుబంధ సంస్థ ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్‌కు వాటాలు ఉన్నాయి. దీంతో ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడినట్లయింది. అందుకే రిలయన్స్-ఫ్యూచర్ ఒప్పందం అమలు విషయమై వివాదం చెలరేగింది.
ఈ నేపథ్యంలో ఫ్యూచర్-రిలయన్స్-అమెజాన్ సంస్థల మధ్య గల వివాదం ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దీంతో ఒప్పంద ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ గడువును పొడిగించక తప్పలేదు.
ఇవి కూడా చదవండి..
బంగారం ధర రూ.40 వేల దిగువకు.. ఎందుకంటే?!
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
దీదీ.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా?
ఒప్పో F19 రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లం టీతో ఆస్తమాకు గుడ్‌బై.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం
ఏప్రిల్‌లో భారత్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

