‘ఆ మహిళ హాబీ రూ లక్షలు కురిపించింది’

లండన్ : మూడేండ్ల వయసులో స్టెఫానీకి గుర్రం బొమ్మలపై ఏర్పడిన ఆసక్తి ఆమెతో పాటు పెరిగి పెద్దదై ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. మూడేండ్ల చిన్నారిగా ఆమె హార్స్ టాయ్స్‌ను సేకరిస్తూ ఇప్పుడు 37 ఏండ్లకు ఎదగగా, ఆమె కలెక్షన్లో ఏకంగా 4500 బొమ్మలు వచ్చిచేరాయి. ఈ టాయ్స్ ఖరీదు రూ 58 లక్షల పైమాటేనని అంచనా. తనకు మూడేండ్ల వయసులో బహుమతిగా వచ్చిన గుర్రం బొమ్మతో తనకు వీటిపట్ల ఆకర్షణ పెరిగిందని స్టెఫానీ చెబుతున్నారు. ఇప్పుడు ఆమె తన టాయ్ కలెక్షన్‌తో ఏకంగా ఓ రూమ్‌నే అలంకరించారు.
బొమ్మల షాపుల చుట్టూ తిరగడం, రీసేల్ షాప్స్‌లో కొనడంతో పాటు ఆన్లైన్లో టాయ్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఈ కలెక్షన్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. 1980ల్లో ఆమె కొనుగోలు చేసిన పలు హార్స్ టాయ్స్ ఇప్పటికీ కార్డు బాక్సుల్లో చెక్కుచెదరకుండా ఉన్నాయి. అయితే స్టెఫానీ తన కలెక్షన్‌ను విక్రయించే ఆలోచన ఇప్పటివరకూ చేయలేదని మెట్రో.కో.యూకే వెల్లడించింది. తన రూమ్‌ను సందర్శించినవారు ఇంద్రధనుస్సును వీక్షించిన వారిలా ఫీలవుతారని స్టెఫానీ చెప్పుకొచ్చారు. తాను బొమ్మలను కొలువుతీర్చిన రూమ్‌ను పోనీ రూమ్‌గా పిలుస్తానని, ఈ రూమ్‌లో రిపేర్ చేసేందుకు వచ్చిన వారు తాము స్టోర్‌లో ఉన్నామా అని ఆశ్చర్యపోతుంటారని చెప్పారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Britain
- hobbey
- toy collection
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

