Gyanvapi | ఉత్తరప్రదేశ్ వారణాసి (Varanasi)లో గల కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి (Gyanvapi) మసీదు (Mosque)పై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీలక తీర్పు వెలువరించింది. జ్ఞానవాపి (Gyanvapi) మసీదులో శాస్త్రీయ సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖ (Archaeological Survey of India)కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే, మసీదులో సర్వే చేసేటప్పుడు నిర్మాణాలకు ఎలాంటి నష్టం జరకూడదని స్పష్టం చేసింది.
జ్ఞానవాపి (Gyanvapi) మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి జిల్లా కోర్టు జులై 21న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగ అధికారులు జులై 24న సర్వే ప్రారంభించారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. ఈ నేపథ్యంలోనే మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా
జ్ఞానవాపి మసీదులో సర్వే జరపడం అవసరమని పేర్కొంది.
Also Read..
Shoaib Malik – Sania Mirza | ఇన్ స్టా బయోలో షోయబ్ కీలక మార్పు.. సానియాతో విడాకులు నిజమేనా..?
Fake Univerisities | ఈ 20 యూనివర్సిటీల్లో అస్సలు చేరకండి.. స్టూడెంట్స్కు యూజీసీ వార్నింగ్
India – Pakistan | భారత్ – పాక్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వానికి సిద్ధం : అమెరికా