Shoaib Malik – Sania Mirza | ఇన్ స్టా బయోలో షోయబ్ కీలక మార్పు.. సానియాతో విడాకులు నిజమేనా..?
Shoaib Malik – Sania Mirza | భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza), పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) విడాకుల (Divorce) వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇందుకు కారణం షోయబ్ తన ఇన్ స్టా గ్రామ్ బయో (Instagram bio)లో కీలక మార్పు చేయడమే.
Shoaib Malik – Sania Mirza | భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza), పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) విడాకులు (Divorce) తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. మాలిక్‌తో బ్రేకప్ చెప్పేందుకు సానియా సిద్ధమైనట్లు టాక్ వినిపించింది. ఈ స్టార్ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ఇద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారంటూ పాకిస్థాన్ మీడియా సైతం ప్రచారం చేసింది. అయితే, ఈ వార్తలపై మాలిక్ ఇప్పటికే స్పందించారు. అది మా వ్యక్తిగతమని, ఆ విషయాన్ని మాకు వదిలేయండి..’ అంటూ వ్యాఖ్యానించారు కూడా. దీంతో రూమర్స్ కు కాస్త బ్రేక్ పడింది.
తాజాగా వీరి విడాకుల విషయం నెట్టింట మరోసారి చర్చకు వచ్చింది. ఇందుకు కారణం షోయబ్ తన ఇన్ స్టా గ్రామ్ బయో (Instagram bio)లో కీలక మార్పు చేయడమే. గతంలో తన బయోలో ‘అథ్లెట్, సూపర్‌వుమన్ సానియా మీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని’ అని ఉండేది. అయితే, ఇప్పుడు దాన్ని మార్చేశాడు. సూపర్ వుమన్ సానియా మీర్జాకు భర్తను అన్న పదాన్ని తొలగించి.. ‘ఓ బిడ్డకు తండ్రి..’ అన్న పదాన్ని మాత్రమే అలాగే ఉంచాడు. దీంతో వీరి విడాకుల రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి.
దాయాదిదేశమైన పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2010లో హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. 2018లో ఈ దంపతులకు ఓ కుమారుడు (ఇజాన్) జన్మించాడు. అయితే, గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి. మాలిక్‌తో బ్రేకప్ చెప్పేందుకు సానియా సిద్ధమైనట్లు టాక్ వినిపించింది. ఈ స్టార్ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ఇద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారంటూ పాకిస్థాన్ మీడియా సైతం ప్రచారం చేసింది. ఓ పాకిస్థాన్ మోడల్ కారణంగా వీరిమధ్య విభేదాలు తలెత్తాయంటూ అక్కడి మీడియా పేర్కొంది. ఈ క్రమంలోనే ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే ఈద్ పండుగ వేళ కూడా ఇద్దరూ వేరువేరు చోట్ల ఉండటం, ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన సానియా ఫేర్ వెల్ మ్యాచ్ కు మాలిక్ హాజరుకాకపోవడం వంటి అంశాలు కూడా వీరి విడాకుల రూమర్స్ కు బలం చేకూర్చాయి.
అయితే, గతంలో విడాకుల వార్తలపై షోయబ్ స్పందించారు. తామిద్దరం కలిసే ఉన్నామని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ ‘జియో న్యూస్’తో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి రూమర్లను తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు. అందుకనే తాను కానీ, ఆమె (సానియా) కానీ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. సానియాతో కలిసి గడిపేందుకు సమయం దొరకట్లేదని వ్యాఖ్యానించారు. ‘ఇందులో చెప్పడానికేమీ లేదు. సానియాతో కలిసి గడిపేందుకు సమయం దొరకట్లేదు. ఈద్ వేళ మేమిద్దరం కలిసి ఉంటే ఎంతో గొప్పగా ఉండేది. అయితే కొన్ని ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ కారణంగా సానియా రాలేకపోయింది. మా ఇద్దరిలో ఎవరికి సమయం దొరికినా ఇరు దేశాలకు వచ్చి వెళ్తుంటాము. మేం ఎప్పుడూ ప్రేమను పంచుకుంటూ ఉంటాము. ఆమెను నేను చాలా మిస్ అవుతున్నా. నేను చెప్పాలనుకున్నది ఇదే’ అని విడాకుల పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.
Also Read..
India – Pakistan | భారత్ – పాక్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వానికి సిద్ధం : అమెరికా
Niharika | మెగా డాటర్ నిహారికతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తరుణ్!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

