Niharika | కథానాయకుడు తరుణ్ తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా వున్న ఆయన త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై ఆయన స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. నా పెళ్లి ఫిక్స్ అయితే స్వయంగా ఆ వార్తను మీడియా ద్వారా పంచుకుంటానని తెలిపారు.
బాలనటుడిగా పలు చిత్రాలకు నటించిన తరుణ్ 2000లో విడుదలైన ‘నువ్వేకావాలి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వరుస ప్రేమకథల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో లవర్‌బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి తరుణ్ సినిమాలకు దూరంగా వున్నాడు.