Viral Video | చేతిలో బైక్ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరూ హీరోలా ఫీలవుతూ ఉంటారు. ఆ బైక్ (bike)పై విన్యాసాలు చేస్తూ.. ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు. తాజాగా ఓ జంట కూడా బైక్ పై స్టంట్ లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసులు (Delhi Police) ట్విట్టర్ లో పోస్టు చేశారు. వీడియోలో ఏముందంటూ.. బైక్ పై ఓ జంట ప్రమాదకరంగా స్టంట్లు (dangerous stunts) చేస్తూ ప్రయాణిస్తుంటుంది. బైక్ నడిపే వ్యక్తి ఉన్నట్టుండి హ్యాండిల్ తో ముందు చక్రాన్ని గాల్లోకి లేపుతాడు. అలాగే చేతులు వదిలేసి కొంతదూరం బండిని పోనిస్తాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి బైక్ పై నియంత్రణ కోల్పోతాడు. దీంతో వెనుక సీటులో కూర్చున్న యువతి ఒక్కసారిగా బలంగా రోడ్డుపైకి పడిపోతుంది. ఈ ప్రమాదంలో ఆ జంటకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
JAB WE MET with an accident due to reckless driving.#DriveSafe@dtptraffic pic.twitter.com/adfwIPtHlX
— Delhi Police (@DelhiPolice) June 28, 2023
Also Read..
Joe Biden | నిద్రలేమితో బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు.. వెల్లడించిన వైట్ హౌస్
Rains | తడిసిముద్దైన ఢిల్లీ.. వర్షం కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు మృతి.. గుజరాత్ కు రెడ్ అలర్ట్
RRR | ప్రౌడ్ మూమెంట్.. ఆస్కార్ జ్యూరీ సభ్యులుగా చరణ్, ఎన్టీఆర్