Joe Biden | నిద్రలేమితో బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు.. వెల్లడించిన వైట్ హౌస్
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) నిద్రకు సంబంధించి తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని శ్వేత సౌధం బుధవారం తెలిపింది. అధ్యక్షుడు దాదాపు 2008 నుంచి స్లీప్ ఆప్నియా అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించింది.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) నిద్రకు సంబంధించి తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని శ్వేత సౌధం బుధవారం తెలిపింది. అధ్యక్షుడు దాదాపు 2008 నుంచి స్లీప్ ఆప్నియా అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఆయన పడుకునే టప్పుడు సీప్యాప్ (కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్) యంత్రాన్ని (CPAP device) వాడుతున్నట్లు తెలిపింది. మంగళవారం రాత్రి సీప్యాప్ మెషీన్ ను బైడెన్ ధరించి పడుకోగా, ఆ మచ్చలు ముఖంపై పడ్డాయి. వైట్ హౌస్ (White House) నుంచి అధ్యక్షడు బయటకు వచ్చిన సమయంలో ఆయన ముఖంపై గీతలు కనిపిండచంతో శ్వేత సౌధం ఈ విషయాన్ని వెల్లడించింది.
సాధారణంగా వృద్ధాప్యంలో స్లీప్ ఆప్నియా సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది చాలా మందిలో కనిపించే ఓ తీవ్రమైన సమస్య. దీని వల్ల గురక వస్తూ నిద్ర సరిగా పట్టదు. నిద్రలో ఉన్న సమయంలో గాలిపీల్చుకోవడం తరచూ ఆగిపోతూ ఉంటుంది. దాంతో గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అమెరికాలో సుమారు కోట్ల మందిలో ఇటువంటి సమస్య ఉండొచ్చని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
వైద్యుల సూచన మేరకు బైడెన్ సీప్యాప్ మెషీన్ ను ముఖానికి ధరించి నిద్ర పోతున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. ఈ యంత్రం ఓ మోటారు సాయంతో గాలిని శ్వాసనాళాల్లోకి పంపుతుంది. దీంతో మెరుగైన శ్వాస ఆడి రాత్రంతా హాయిగా నిద్రపడుతుంది. జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆప్నియా కారణంగా ఆయన హార్ట్ బీట్ లో సమస్యలు ఏర్పడుతున్నాయని వైద్యులు గుర్తించారు.
Also Read..
Madonna | తీవ్రమైన ఇన్ ఫెక్షన్ తో ఆసుపత్రి పాలైన పాప్ సింగర్
Rains | తడిసిముద్దైన ఢిల్లీ.. వర్షం కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు మృతి.. గుజరాత్ కు రెడ్ అలర్ట్
RRR | ప్రౌడ్ మూమెంట్.. ఆస్కార్ జ్యూరీ సభ్యులుగా చరణ్, ఎన్టీఆర్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

