Madonna | తీవ్రమైన ఇన్ ఫెక్షన్ తో ఆసుపత్రి పాలైన పాప్ సింగర్
Madonna | అమెరికన్ పాప్ సింగర్ (American singer) మడోన్నా (Madonna) గురించి తెలియని వారు ఉండరు. తన గాత్రంతో ఉర్రూతలూగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది. మడోన్నా స్టేజ్ పై పాట పాడుతోందని తెలిస్తే చాలు అభిమానులు క్షణాల్లో అక్కడ వాలిపోతుంటారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ గాయని.. ఇప్పుడు ఆసుపత్రి (Hospitalised) పాలైంది.
Madonna | అమెరికన్ పాప్ సింగర్ (American singer) మడోన్నా (Madonna) గురించి తెలియని వారు ఉండరు. తన గాత్రంతో ఉర్రూతలూగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది. మడోన్నా స్టేజ్ పై పాట పాడుతోందని తెలిస్తే చాలు అభిమానులు క్షణాల్లో అక్కడ వాలిపోతుంటారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ గాయని.. ఇప్పుడు ఆసుపత్రి (Hospitalised) పాలైంది. తీవ్ర ఇన్ ఫెక్షన్ (Serious Infection) కారణంగా న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రి ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతున్నట్లు గాయని మేనేజర్ వెల్లడించారు.
ఈనెల 24వ తేదీన మడోన్నాకు సీరియస్ బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ (serious bacterial infection) సోకిందని తెలిపారు. దీంతో కొన్ని రోజులపాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో ఉండాల్సి వచ్చిందన్నారు. గాయని ప్రస్తుతం కోలుకుంటున్నట్లు చెప్పారు. ఆమె పూర్తిగా కోలుకునేంత వరకూ వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు తెలిపారు. దీంతో ఆమె ముందుగా ఒప్పుకున్న అన్ని ప్రోగ్రామ్స్ కు తాత్కాలికంగా కొంత బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పారు. గాయని పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తారని స్పష్టం చేశారు. తాను ముందుగా ప్రకటించిన వరల్డ్ టూర్ ను కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపారు.
కాగా, 65 ఏళ్ల మడోన్నా.. సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా 40వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఏడాది ప్రారంభంలో ‘సెలబ్రేషన్స్’ టూర్ ను ప్రకటించింది. ఈ వరల్డ్ టూర్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా తన గానంతో అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది. ఈ పర్యటన జులై 15న కెనడాలోని వాంకోవర్ లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత యూఎస్, యూరప్ తదితర ప్రాంతాల్లో సెలబ్రేషన్స్ తర్వాత డిసెంబర్ 1వ తేదీన ఆమ్స్టర్డామ్ లో టూర్ ముగియనుంది. దీంతో మడోన్నా పర్యటన కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె పర్యటన నిమిత్తం ఇప్పటికే చాలా టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే, ఇప్పుడు మడోన్నా అనారోగ్యానికి గురికావడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Also Read..
Titanic submersible | ఒడ్డుకు చేరిన మినీ టైటాన్ శకలాలు.. మానవ అవశేషాలు స్వాధీనం
Tomato Price | కేంద్రం మాటలు ఒట్టివే.. టమాటా ధర తగ్గేది ఆగస్ట్‌లోనే
Hacking | లెట్మీ స్పై యాప్ హ్యాకింగ్.. లక్షలాది మంది డాటా గల్లంతు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

