Tomato Price | న్యూఢిల్లీ, జూన్ 28: టామాటాల ధర పెరుగుదల తాత్కాలికమేనన్న కేంద్రం మాటలు ఒట్టివేనని తేలిపోయింది. వచ్చే ఖరీఫ్ సీజన్లో(ఆగస్ట్) పంట భారీగా చేతికొస్తుందని అప్పుడే రేట్లు తగ్గే అవకాశముందని వ్యాపారులు చెప్తున్నారు. టామాట సాగు ఇటీవలే వర్షాల తర్వాత ప్రారంభమైందని వారు తెలిపారు.
మార్చి-ఏప్రిల్ నెలల్లో వేడి గాలులు వీయడం, పంటకు భారీగా తెగులు సోకడంతో టామాటా ఉత్పత్తి, నాణ్యత పడిపోయిందని వారు వెల్లడించారు. అయితే ఈ ఏడు వేసవిలో తెగుళ్ల వల్ల పంట ఉత్పాదకత ఖర్చు పెరిగిందని, దానికి తోడు దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయని మహారాష్ట్రకు చెందిన జున్నార్ టామాటా పెంపకందారుల సంఘం అధ్యక్షుడు దీపక్ తెలిపారు.