కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 45 రోజుల్లో సరిహద్దు కంచెను నిర్మిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలోకి జరుగుతున్న చొరబాట్లు దేశమంతటికీ ప్రధాన సమస్యగా మారిందన్నారు. కోర్టు ఆదేశించినప్పటికీ కంచె నిర్మాణానికి అవసరమైన భూమిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం కేటాయించడం లేదని చెప్పారు.
చొరబాటుదారులను టీఎంసీ ఓటు బ్యాంకుగా చూస్తున్నదన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్పుర్లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మమత ప్రభుత్వం అవినీతికి నిలయంగా మారిందని ఆరోపించారు.