న్యూఢిల్లీ : గత పదేండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్(ఈడీ) 193 కేసులను నమోదు చేసిందని కేంద్రం మంగళవారం పార్లమెంట్‌కు తెలిపింది. ఈ కేసుల్లో నిందితులుగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ నాయకులు ఉన్నారని వెల్లడించింది. అయితే కేవలం రెండు కేసుల్లోనే నేర నిర్ధారణ జరిగిందని, ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఏ నిందితుడికి విముక్తి లభించలేదని తెలిపింది. ఏప్రిల్ 2022-మార్చి 2023 మధ్య కాలంలో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయని చెప్పింది. రాష్ర్టాల వారీగా, పార్టీల వారీగా ఎంత మంది ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసులు నమోదయ్యాయన్న వివరాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.