Karnataka Results | దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections ) ఫలితాలు (Results) వెలువడుతున్నాయి. మొత్తం 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (Votes Counting) ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 114 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అధికార బీజేపీ (BJP) 79 స్థానాల్లో.. జేడీఎస్ (JDS) 26 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. బెంగళూరు ( Bengaluru) సహా దేశరాజధాని ఢిల్లీ (Delhi) లోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. డ్యాన్సులు చేస్తూ, డప్పు వాయ్యిధ్యాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిమ్లాలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశ, కర్ణాటక ప్రజల శాంతి, సామరస్యం కోసం ప్రార్థించారు.
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్
Karnataka | కౌంటింగ్ వేళ.. బీజేపీ ఆఫీసులోకి ప్రవేశించిన పాము
Appointments Cancellation: 36 వేల మంది టీచర్ ఉద్యోగుల్ని తొలగించిన బెంగాల్ కోర్టు