Appointments Cancellation: 36 వేల మంది టీచర్ ఉద్యోగుల్ని తొలగించిన బెంగాల్ కోర్టు
Appointments Cancellation: కోల్‌కతా హైకోర్టు 36 వేల టీచర్ ఉద్యోగుల అపాయింట్మెంట్ను రద్దు చేసింది. సరైన శిక్షణ లేకుండానే అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు కోర్టు పేర్కొన్నది. నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకున్నట్లు కోర్టు తెలిపింది.
కోల్‌కతా: బెంగాల్లో ఒకేసారి 36 వేల మంది ప్రైమరీ టీచర్ల ఉద్యోగాలను కోల్‌కతా హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉద్యోగుల అపాయింట్మెంట్ రద్దు(Appointments Cancellation) చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అపాయింట్మెంట్ ప్రక్రియలో సరైన విధానాలను పాటించలేదని కోర్టు చెప్పింది. జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రైమరీ టీచర్ల రిక్రూట్మెంట్లో జరిగిన అవినీతి బెంగాల్ చరిత్రలోనే అతిపెద్దదని ఆయన అన్నారు. 2016లో జరిగిన రిక్రూట్మెంట్ సమయంలో ఎంపికైన 36 వేల మంది అభ్యర్థులు సరైన రీతిలో శిక్షణ పొందలేదని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది.
ఈ కేసులో 17 పేజీల తీర్పును జస్టిస్ గంగోపాధ్యాయ వెలువరించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ తీర్పును హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అభ్యర్థులు విఫలమైనట్లు కోర్టు తెలిపింది. 2014లోని టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రకారం శిక్షణ జరగలేదని, అందుకే అపాయింట్మెంట్ను రద్దు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

