HD Devegowda | కాంగ్రెస్ ప్రభుత్వం జేడీ (ఎస్)ను ఖతం చేయాలని చూస్తుందని మాజీ ప్రధాని, జేడీ(ఎస్) రాజ్యసభ సభ్యుడు హెచ్డీ దేవె గౌడ ఆరోపించారు. శనివారం హస్సన్ జిల్లా హోలెనర్సిపుర తాలుకా హరదనహల్లిలో కుటుంబ దైవం దేవేశ్వర టెంపుల్లో నిర్వహించిన పూజాకార్యక్రమంలో హెచ్డీ దేవె గౌడ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజల మద్దతుతో మా పార్టీ రాష్ట్రంలో అంచెలంచెలుగా ఎదిగింది. నేను గత 65 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే నుంచి ప్రధానమంత్రిగా అవకాశాలు అందుకున్నానంటే కర్ణాటక ప్రజల మద్దతు, ఆశీస్సుల వల్లే. నాకు ఇప్పుడు 93 ఏండ్లు. నా చివరి శ్వాస వరకు నేను ఈ విషయాన్ని మరిచిపోనన్నారు దేవెగౌడ.
గత రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం జేడీ(ఎస్)ను అంతం చేసేందుకు హస్సన్ జిల్లాలోనే రెండు సమావేశాలను నిర్వహించింది. కానీ పార్టీ ప్రజల మద్దతు, సహకారంతో ముందుకొచ్చింది. పార్టీని పునరుద్దరించేందుకు, కాపాడేందుకు హసన్ శివార్లలో 25వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడంతో భాగంగా జనతా సమావేశాన్ని నిర్వహించాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఈవెంట్‌ను నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో దేవెగౌడ కుమారులు హెచ్డీ కుమారస్వామి, హెచ్డీ రేవన్న కూడా పాల్గొన్నారు.
Dhanush – Mrunal | ధనుష్‌తో పెళ్లి పుకార్ల మధ్య మృణాల్ ఠాకూర్ వైరల్ వీడియో… షాక్ అవుతున్న నెటిజన్స్
MSG | లాంగ్ వీకెండ్ టార్గెట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’… మళ్లీ ఊపందుకున్న మెగాస్టార్ సినిమా
Rimi Sen | నటన రాదు అయిన స్టార్ అయ్యాడు.. జాన్ అబ్రహంపై రిమీ సేన్ సంచలన వ్యాఖ్యలు