హరియాణలో బీజేపీ, జేజేపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్ధాయిలో ఎండగడతామని హరియాణ అసెంబ్లీలో విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా స్పష్టం చేశారు. బీజేపీ సర్కార్ను సాగనంపాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. బీజేపీ, జేజేపీ సర్కార్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపు ఇస్తోందని చెప్పారు. హరియాణ మాంగే హిసాబ్ పేరుతో నిరసనలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కాషాయ కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని ఆయన వెల్లడించారు. ఇక తాము అధికారంలోకి వచ్చిన అనంతరం తాము ఏం చేస్తామో ప్రజలకు విస్పష్ట హామీ ఇస్తామని అన్నారు. మరోవైపు జార్ఖండ్లో కాషాయ కూటమి వైఫల్యాలతో రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోయారని చెప్పారు.
రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత బీరేందర్ సింగ్ అన్నారు. కాగా, హరియాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఎన్ఎల్డీ, బీఎస్పీల మధ్య పొత్తు ఖరారైంది. ఇరు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో కలిసి పోరాడతాయని ఇరు పార్టీలు గురువారం ప్రకటించాయి. పదేండ్లుగా హరియాణను లూటీ చేస్తున్న బీజేపీని అధికారం నుంచి సాగనంపాలని, కాంగ్రెస్ను అధికారానికి దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా పేర్కొన్నారు.
Read More :