Priyanka Gandhi | కాంగ్రెస్ (Congress) పార్టీ 85వ ప్లీనరీ (Party Plenery) సమావేశాలు ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాజధాని రాయ్‌పూర్ ( Raipur) లో రెండో రోజు కొనసాగుతున్నాయి. ఏఐసీసీ చీఫ్ (Aicc Chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలకు కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సహా.. 15 వేల మందికి పైగా ప్రతినిధులు, నాయకులు హాజరవుతున్నారు.
ప్లీనరీ సమావేశాలకు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. నేతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు బస చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా, పసందైన ఆహార వంటలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తోంది. దీంతోపాటు మైమరిచిపోయేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దింది. కాగా, శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) రాయ్‌పూర్ ( Raipur) చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆమెకు ఛత్తీస్‌గఢ్ సీఎం (Chhattisgarh Cm) భూపేశ్ బఘేల్ (Bhupesh Baghel)స్వాగతం పలికారు. అయితే ప్రియాంక సహా ఇతర అగ్రనేతను ఆహ్వానించేందుకు చేసిన ఏర్పాట్లు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
ప్రియాంక సహా పలు అగ్రనేతలకు ఆహ్వానం పలికేందుకు రాయ్‌పూర్‌లోని ప్రధాన రహదారిపై ఏకంగా గులాబీ పూలను (Red Rose Carpet) పరిచారు. రోడ్డుకు ఒకవైపున కనుచూపు మేర పూలతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందుకోసం 6 వేల కిలోలకు పైగా ఎర్ర గులాబీ పూలను వినియోగించినట్లు సమాచారం.
#WATCH | Chhattisgarh: Flower petals were laid on the streets to welcome Congress general secretary Priyanka Gandhi Vadra and other Congress leaders in Raipur for the 85th Plenary Session of the party. pic.twitter.com/Z4hozwKDl8
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 25, 2023
Congress plenary session: Street paved with flower petals to welcome Priyanka Gandhi in Raipur
Read @ANI Story | https://t.co/yaaJYFD87b#PriyankaGandhi #Raipur #Chhattisgarh #Congress #PlenarySession pic.twitter.com/pzYmHasAsK
— ANI Digital (@ani_digital) February 25, 2023
Also Read..
CWC: నేరుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఎంపిక.. నామినేట్ చేయనున్న ఖర్గే
Sonia Gandhi: రిటైర్మెంట్పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ
Congress | నేటి నుంచి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు.. కీలక చర్చకు సోనియా, రాహుల్ దూరం..!