హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి(Lionel Messi)ని.. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కలుసుకోనున్నారు. హైదరాబాద్‌లోని ఫలక్నామా ప్యాలెస్ హోటల్లో ఆ ఇద్దరు భేటీ అయ్యే అవకావాలు ఉన్నాయి. గోట్ టూరులో భాగంగా కోల్‌కతా చేరుకున్న మెస్సి.. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. అయితే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ కూడా ఇవాళ హైదరాబాద్ రానున్నట్లు సమాచారం ఉన్నది. ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ మధ్యాహ్నం శంషాబాద్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌కు వెళ్తారు. ఆ హోటల్లో మెస్సిను రాహుల్ గాంధీ కలిసే ఛాన్సు ఉన్నది.
ఇవాళ రాత్రికి ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనున్నది. సింగరేణి ఆర్ఆర్9, అపర్ణ మెస్సి ఆల్ స్టార్స్‌తో మ్యాచ్ జరగనున్నది. సుమారు 20 నిమిషాల పాటు జరిగే ఆ మ్యాచ్‌లో ఓ అయిదు నిమిషాల పాటు మెస్సి, సీఎం రేవంత్ రెడ్డి ఆడనున్నారు. ఈ మ్యాచ్‌ను రాహుల్ గాంధీ తిలకించనున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ ఢిల్లీకి పయనమై వెళ్తారు.