Sonia Gandhi: రిటైర్మెంట్పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ
Sonia Gandhi: రాజకీయాలకు సోనియా రిటైర్మెంట్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. రాయ్‌పూర్ మీటింగ్‌లో ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర సక్సెస్‌తో తన ఇన్నింగ్స్ ముగుస్తున్నట్లు ఆమె చెప్పారు.
రాయ్‌పూర్: రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో సోనియా గాంధీ(Sonia Gandhi) ఉన్నట్లు తెలుస్తోంది. చత్తీస్ఘడ్(Chattisgarh)లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) సమావేశాల్లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మాట్లాడారు. డాక్టర్ మనోహ్మన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో తమ పార్టీ విజయం సాధించడం తనకు ఎనలేని సంతృప్తిని ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కానీ భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తుందని, ఆ యాత్ర తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీకి అదే టర్నింగ్ పాయింట్ అవుతుందని సోనియా గాంధీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇది సవాళ్లతో కూడుకున్న సమయం అని, ఎందుకంటే బీజేపీ-ఆర్ఎస్ఎస్లు దేశంలో అన్ని సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. కొంత మంది వ్యాపారవేత్తలకు మద్దతు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు ఆమె చెప్పారు. సామరస్యం, సహనం, సమానత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నట్లు భారత్ జోడో యాత్రతో తెలిసిందని సోనియా అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

