లక్నో: కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరీ(Pankaj Chaudhary)ని .. ఉత్తరప్రదేశ్ బీజేపీ పార్టీ చీఫ్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం లక్నోలో గ్రాండ్ ఆ సెర్మనీ జరిగే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన తన నామినేషన్ పేపర్స్ దాఖలు చేసే అవకాశం ఉన్నది. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరుకానున్నారు. జాతీయ కార్యదర్శి వినోద్ తవడే కూడా హాజరవుతారు.
మహారాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచి పంకజ్ చౌదరీ ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. ఆయన ఫ్యామిలీకి రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది. పంకజ్ తల్లి ఉజ్వల్ చౌదరీ.. మహారాజ్గం్ జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్‌గా చేశారు. ఆయన గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్థానిక ఎన్నికల్లోనూ చౌదరీ గెలిచారు. గోరఖ్‌పూర్ మున్సిపల్ సభ్యుడిగా 1989 నుంచి 1991 మధ్య చేశారు. 1990 నుంచి బీజేపీ సభ్యుడిగా పంకజ్ చౌదరీ తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ రెండో హయంలో ఆయన ఆర్థికశాఖ సహాయమంత్రిగా చేరారు.
కుర్మీ వర్గానికి పంకజ్ చౌదరీ చెందుతారు. యూపీలో కుర్మీ కులాన్ని ఓబీసీ కేటగిరీలో చూస్తారు. యూపీ ఓబీసీ ఓటర్లలో.. యాదవ్‌ల తర్వాత కుర్మీలు రెండో స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో 8 నుంచి 10 శాతం కుర్మీ ఓటర్లు ఉన్నారు. అంటే కనీసం 30 నుంచి 40 సీట్ల వరకు వారి ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. తెరాయి, కాశీ, గోరఖ్‌పూర్, అవద్, రోహిల్ఖాండ్ ప్రాంతాల్లో కుర్మీల ప్రభావం ఉన్నది.
సంతోష్ గాంగ్వర్ను గవర్నర్‌గా చేయడంతో.. బీజేపీ చీఫ్ రేసులో పంకజ్ చౌదరీ నిలిచారు. 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓ బీసీ నేతకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నది.