కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పీఎంవోతో మాట్లాడారంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కాంగ్రెస్ స్పందించింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని ఎలా నమ్మగలం? అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పీఎంవో అధికారులతో సంభాషించారని ఓ జాతీయ పత్రిక తన ప్రత్యేక కథనంలో పేర్కొంది. ఈ విషయంపైనే కాంగ్రెస్ ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల సంఘం అనేది ఓ స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన సంస్థ అని, వారితో పీఎంవో ఎలా మాట్లాడింది? అని ఆయన ప్రశ్నించారు. ఇలా జరిగితే… ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని ఎలా చెప్పగలుగుతారని ఆయన నిలదీశారు. రానున్న రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, వాటిలో తమకు న్యాయం జరుగుతుందని ఎలా ఆశించగలమని ఖర్గే ప్రశ్నించారు.