Mallikarjun Kharge | ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం బెంగళూరు (Bengaluru)లోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో (MS Ramaiah Hospital) వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఖర్గే శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్యులు పేస్‌మేకర్‌ను అమర్చారు (pacemaker implant). గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు దీన్ని అమరుస్తారు. ఈ విషయాన్ని ఖర్గే కుమారుడు, కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
మంగళవారం రాత్రి మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో స్వల్పంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యలు స్పష్టం చేశారు. ఖర్గే ఆసుపత్రిలో చేరారన్న వార్తతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ సీనియర్ నాయకులు ట్వీట్ చేశారు. మల్లికార్జున్ ఖర్గే వయను 83 సంవత్సరాలు. ఆయన సీనియర్ పార్లమెంటేరియన్. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతల్లో ఒకరు. అక్టోబర్ 2022 నుంచి ఆయన ఏఐసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.
Also Read..
DA hike | పండగ వేళ గుడ్‌న్యూస్ చెప్పనున్న కేంద్రం.. ఉద్యోగులకు డీఏ పెంపు..?
Zubeen Garg | సింగర్ మరణంపై అనుమానాలు.. జుబీన్ మేనేజర్ అరెస్ట్