సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 10:16:34

బీహార్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల‌ను నియ‌మించిన కాంగ్రెస్‌

బీహార్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల‌ను నియ‌మించిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్నిక‌లు ముగిశాయి. మ‌హాకూట‌మికి అనుకూలంగా ఫ‌లితాలు వెలువ‌డుతాయ‌ని ఎగ్జిపోల్స్ అంచ‌నా వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. రాష్ట్రంలో పార్టీ  ప‌రిశీలకులుగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ర‌న్‌దీప్ సుర్జేవాలా, అవినాశ్ పాండేల‌ను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియ‌మించారు. ఎన్నిక‌ల‌ ఫ‌లితాల అనంత‌రం కేంద్ర నాయ‌క‌త్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను నిర్ణ‌యించ‌నున్నార‌ని స‌మాచారం. 

బీహార్‌లో ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్ నేతృత్వంలోని మహా కూటమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఈ కూట‌మికి 120 సీట్లు వ‌స్తాయ‌ని టైమ్స్‌నౌ-సీ ఓట‌ర్ స‌ర్వే వెల్ల‌డించ‌గా, 118-138 సీట్లు వ‌స్తాయ‌ని రిప‌బ్లిక్ టీవీ-జ‌న్‌కీ బాత్‌, టీవీ9-భార‌త్ వ‌ర్ష్‌, ఏబీపీ న్యూస్‌- సీ ఓట‌ర్ త‌దిత‌ర‌ సంస్థ‌లు తేజ‌స్వీదే ఆధిక్య‌మ‌ని స్ప‌ష్టం చేశాయి. కాగా, సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (బీజేపీ, జేడీయూ)కి దైనిక్‌ భాస్కర్‌ సర్వే సంస్థ మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీని కట్టబెట్టింది. 

మొత్తం  243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు ద‌శ‌ల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈనెల 10న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు అవసరం. జేడీయూ, బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్న ఎన్డీఏ మరోసారి అధికారం దక్కించుకోవాలని భావిస్తుండగా.. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు కలిసి ఏర్పడిన మహాకూటమి గట్టి పోటీనిచ్చింది. చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ ఒంటరిగా బరిలోకి దిగింది.