న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల సర్వీసు నియామకాలకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. మోదీ సర్కార్ ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వ విభాగంగా మార్చాలని చూస్తోందని ఇది ఏమాత్రం సహేతుకం కాదని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఈసీని తటస్ధ , స్వతంత్ర సంస్ధగా ఉంచాలని కోరుకోవడం లేదని దుయ్యబట్టారు. ఈసీని ప్రభుత్వం జేబు సంస్ధగా మార్చేస్తే ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగే పరిస్ధితి కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ బిల్లును తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.ఎన్నికల కమిషన్‌ను మోదీ ఎన్నికల కమిషన్‌గా మార్చాలని ఆయన కోరుకుంటున్నారని దుయ్యబట్టారు.
Read More :