Gaurav Gogoi | పార్లమెంట్లో విపక్షాలపై బుల్డోజర్ నడిపిస్తున్నారు : కాంగ్రెస్ ఎంపీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విపక్షం లక్ష్యంగా బుల్డోజర్ నడిపిస్తోందని వేటుకు గురైన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ (Gaurav Gogoi) ఆరోపించారు.
న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఇరు సభల్లోనూ గందరగోళం కొనసాగుతోంది. రాజ్యసభ, లోక్‌సభల్లో సోమవారం కూడా సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది. 33 మంది విపక్ష ఎంపీలను పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేయడంతో విపక్షాలు ప్రభుత్వంపై భగ్గుమన్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విపక్షం లక్ష్యంగా బుల్డోజర్ నడిపిస్తోందని వేటుకు గురైన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ (Gaurav Gogoi) ఆరోపించారు. పార్లమెంట్‌ను నడిపే ఉద్దేశంతో బీజేపీ అధికారంలోకి రాలేదని మండిపడ్డారు. 13న చోటుచేసుకున్న పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు.
పార్లమెంట్లో ప్రభుత్వం బుల్డోజర్లు నడిపిస్తున్న తీరును యావత్ దేశం చూస్తోందని, ఇది విపక్ష నేతలను అణగదొక్కడం మినహా మరొకటి కాదని గౌరవ్ గగోయ్ దుయ్యబట్టారు. అమిత్ షా వైఫల్యాలను మరుగుపరిచేందుకు వారు విపక్షంపై బుల్డోజర్ నడిపిస్తున్నారని మండిపడ్డారు. విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తీర్మానం ప్రవేశపెట్టగా అధ్యక్ష స్ధానంలో ఉన్న బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ విపక్ష సభ్యులు సభా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.
Read More :
Vegetables | దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు.. టమాట, పచ్చి మిర్చి కొనుక్కొని ఇంటిబాట పడుతున్న ప్రజలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

