Rashmika Mandanna | 16వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఈనెల 1వ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలకు సినీ ప్రముఖులు ఎవరూ రాకపోవడంపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే (కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం) రవి గనిగ ( Ravi Ganiga) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి హాజరయ్యేందుకు రష్మిక నిరాకరించినట్లు చెప్పారు.
తన కెరీర్‌ను ప్రారంభించిన పరిశ్రమను (Kannada film industry) రష్మిక విస్మరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కర్ణాటకలో కన్నడ చిత్రం కిరిక్ పార్టీ (Kirik Party)తో తన కెరీర్‌ను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. అయితే, గతేడాది అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి తాము ఆహ్వానం పంపితే నిరాకరించిందని మండిపడ్డారు. ‘అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి రష్మికను ఆహ్వానించేందుకు మా ఎమ్మెల్యే స్నేహితుల్లో ఒకరు ఆమె ఇంటికి 10 నుంచి 12 సార్లు వెళ్లారు. కానీ ఆమె ఈవెంట్‌కు హాజరయ్యేందుకు నిరాకరించారు. నా ఇల్లు హైదరాబాద్‌లో ఉందని చెప్పారు. ఈవెంట్‌కు వచ్చేందుకు తనకు సమయం కూడా లేదని.. రాలేనని చెప్పారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమె కెరీర్ ప్రారంభించినప్పటికీ.. కన్నడ భాషను విస్మరించారు. అగౌరవపరిచారు. కన్నడను విస్మరించిన రష్మికకు మనం గుణపాఠం నేర్పించకూడదా?’ అంటూ గనిగ వ్యాఖ్యానించారు.
Bengaluru | Congress MLA Ravikumar Gowda Ganiga says, “Rashmika Mandanna, who started her career with the Kannada movie Kirik Party in Karnataka, refused to attend the International Film Festival last year when we invited her. She said, ‘I have my house in Hyderabad, I don’t know… pic.twitter.com/uftmWfrMZ6
— ANI (@ANI) March 3, 2025
చలనచిత్ర రంగంపై చాలా కోపంగా ఉంది : డీకే శివకుమార్
కాగా, శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. సినీ ప్రముఖులను ఆక్షేపించారు. తనకు చలనచిత్ర రంగంపై చాలా కోసంగా ఉందన్నారు. చలన చిత్ర రంగం కోసమే నిర్వహిస్తున్న బెంగళూరు చలన చిత్రోత్సవానికి పట్టుమని పది మంది నటులు కూడా పాల్గొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అవసరముంటే వారికి ప్రభుత్వ సాయం చేయాలి. థియేటర్లు, చిత్ర నిర్మాణానికి రాయితీలివ్వాలి. మేము అవకాశం ఇవ్వకుంటే థియేటర్లు నడపలేరు. ఎవరి నట్లు, బోల్ట్‌లు ఎలా సరిచేయాలో నాకు తెలుసు’ అంటూ డీకే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు, చలన చిత్ర రంగానికి చెందిన ప్రముఖులు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన సంఘటనను ఎమ్మెల్యే తాజాగా గుర్తు చేసుకున్నారు. అనేకసార్లు ఈ చలనచిత్రోత్సవాలకు రష్మికను ఆహ్వానించినట్లు చెప్పారు. అయినప్పటికీ ఆమె నిరాకరిస్తూ వస్తున్నారన్నారు.
రష్మిక కెరీర్ విషయానికి వస్తే.. రక్షిత్ శెట్టి నటించిన కిరిక్ పార్టీ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సమయంలోనే రక్షిత్ శెట్టి, రష్మిక ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే అనుకొని కారణాల వలన ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్‌కి షిప్ట్ అయిన రష్మిక ఛలో, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకేవ్వరు, భీష్మా, పుష్ప 1.2 చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.
Also Read..
MK Stalin | ఆలస్యం చేయకండి.. అత్యవసరంగా పిల్లల్ని కనండి : తమిళ ప్రజలకు సీఎం స్టాలిన్ కీలక విజ్ఞప్తి
Ola Electric | 1,000 మందిపై వేటుకు సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్.. ఐదు నెలల్లోనే రెండో రౌండ్ లేఆఫ్స్
PM Modi | కెమెరా చేతపట్టి లయన్ సఫారీకి వెళ్లిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్