Caste Census | కుల గణన డిమాండ్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు : ఖర్గేకు ఆనంద్ శర్మ లేఖ
Caste Census : జాతీయ స్ధాయిలో కుల గణన చేపట్టాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్‌లో ఇదే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Caste Census : జాతీయ స్ధాయిలో కుల గణన చేపట్టాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్‌లో ఇదే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధాంతపరమైన రాజకీయాలను కాంగ్రెస్ సమర్ధించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ అధినాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుల గణన డిమాండ్‌తో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను పార్టీ అగౌరవపరిచిందని తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో ఆనంద్ శర్మ పేర్కొన్నారు. 1980ల్లో ఇందిరా గాంధీ ఓ సందర్భంలో చేతిపై కులం ముద్ర ఉండదని చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరికి అద్దం పడతాయని, అలాగే 1990ల్లో కులాన్ని ఎన్నికల అంశంగా మలచడాన్ని రాజీవ్ గాంధీ వ్యతిరేకించారని ఆనంద్ శర్మ గుర్తుచేశారు.
ఈ అంశంపై పార్టీ చారిత్రక వైఖరికి విరుద్ధంగా వ్యవహరించడం చాలా మంది కాంగ్రెస్ వ్యక్తులకు, మహిళలకు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. కుల గణన డిమాండ్ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హయాంను అగౌరవపరుస్తోందనేది తన అభిప్రాయమని వివరించారు. కాగా, కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడితే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Read More :
BJP’s Top Muslim Leader Joins Congress | కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ టాప్ ముస్లిం నాయకుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
New Zealand: గాయపడ్డ ఇద్దరు కివీస్ క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కు దూరం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

