కోల్కతా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లపై జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ (53) వయసు కన్నా తక్కువ స్థానాలే వస్తాయని తెలిపారు. అయితే ఆయన రాహుల్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, ‘షెహజాదా’ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా, బారక్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, టీఎంసీ పాలనలో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయారన్నారు. మోదీ ఉన్నంత వరకు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను ఎవరూ రద్దు చేయలేరన్నారు.