న్యూఢిల్లీ : భారత్ జోడో యాత్ర మలి విడత యాత్రకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేపట్టింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా డిసెంబర్-ఫిబ్రవరిలోగా భారత్ జోడో యాత్ర 2.0ను (Bharat Jodo Yatra 2.0) ప్రారంభించేందుకు ఆ పార్టీ కసరత్తు సాగిస్తోంది. రాహుల్ గాంధీ సారధ్యంలో సాగే మలి విడత యాత్రలో భాగస్వాములయ్యే వారు కాలినడకన ఆపై వాహనాలనూ ఉపయోగించేలా హైబ్రిడ్ మోడ్లో సాగుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
భారత్ జోడో యాత్ర తొలి దశ 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై కశ్మీర్లోని శ్రీనగర్లో 2023 జనవరిలో ముగిసింది. ఈ యాత్ర 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాల మీదుగా 126 రోజుల పాటు కొనసాగింది. యాత్ర పొడవునా రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు క్షేత్రస్ధాయి నేతలు, కార్యకర్తలు, ప్రజలతో మమేకమవుతూ ముందుకుసాగారు.
బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. భారత్ జోడో యాత్ర 2.0ను ప్రారంభించాలని పలువురు నేతలు సైతం రాహుల్ గాంధీకి విజ్ఞప్తులు చేస్తుండటంతో మరో విడత యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
Read More :
Priyank Kharge | 8 ఏండ్లలో 5గురు సీఎంలను మార్చిన చరిత్ర బీజేపీది : ప్రియాంక్ ఖర్గే