Rahul Gandhi : రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధులతో కూడిన మలివిడత జాబితాపై కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది. ఢిల్లీలో సోమవారం జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం కీలక వివరాలు వెల్లడికానున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసే మరో స్ధానంపైనా ఈ భేటీ అనంతరం స్పష్టత రానుంది.
కాంగ్రెస్ ఇప్పటికే 39 లోక్సభ స్ధానాల్లో తలపడే అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 2019 ఎన్నికల్లో తాను గెలుపొందిన కేరళలోని వయనాద్ స్ధానం నుంచే రాహుల్ గాంధీ బరిలో దిగుతారని కాంగ్రెస్ వెల్లడించింది.
ఇక రాహుల్ మరో స్ధానం నుంచి బరిలో దిగుతారని, ఏ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారనే వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఇక రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈనెల 17న ముగిసిన అనంతరమే వయనాద్లో ఆయన పర్యటన తేదీలు ఖరారవుతాయని చెప్పారు.
Read More :